Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పి రెండు లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.

Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

Cyber Crime

Cyber Attack : ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పి 15 రోజుల క్రితం రెండు లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేసే మేఘన తన ఇంటిని కిరాయికి ఇచ్చేందుకు హౌసింగ్.కామ్‌లో ప్రకటన ఇచ్చింది. ప్రకటన గమనించిన సైబర్ నేరగాడు.. డబ్బు కాజేయాలని పథకం పన్నాడు. అందులోని నంబర్‌కి ఫోన్ చేసి తాను ఆర్మీ ఉద్యోగినని.. మీ ఇంటిని రెంటుకు తీసుకుంటానని మాటలు కలిపాడు.

చదవండి : Cyber Crime : మిత్రుడి ఫోటోతో వాట్సప్ చాటింగ్-రూ.30 వేలు కాజేసిన సైబర్ నేరస్థుడు

సైబర్ నేరగాడి మాయమాటలు నమ్మిన మహిళ అతడికి ఇంటిని రెంటుకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో రెండు నెలల రెండు అడ్వాన్స్ రూ.28 వేలు పంపిస్తానని నమ్మించి గూగుల్‌పే క్యూ‌ఆర్‌కోడ్ పంపించాడు. సైబర్ నేరగాడు పంపిన క్యూఆర్ కోడ్ రిసీవ్ అని కాకుండా పే అని ఉంది. హడావిడిలో అది గమనించని మేఘన పే కొట్టింది. దీంతో ఆమె అకౌంట్‌లో ఉన్న నగదుతో రూ.2 లక్షల రూపాయలు డెబిట్ అయ్యాయి.

చదవండి : Cyberabad Police : దేశంలోనే భారీ సైబ‌ర్ క్రైమ్.. ముఠా గుట్టురట్టు.. 14మంది అరెస్ట్!

వెంటనే తేరుకున్న మేఘన సైబర్ పోర్టల్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ ప్రశాంత్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. పేమెంట్ గేట్ వే ద్వారా డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.. వెంటనే ఆ కంపెనీకి నోటీసులు జారీచేసి.. డబ్బు ట్రాన్ఫర్ అయిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. ఇక ఈ అంశంపై పేమెంట్ గేట్ వే ప్రతినిధులతో పోలీసులు మంతనాలు జరిపారు.

చదవండి : Cyberabad Police : దేశంలోనే భారీ సైబ‌ర్ క్రైమ్.. ముఠా గుట్టురట్టు.. 14మంది అరెస్ట్!

దీంతో డబ్బు తిరిగి ఇచ్చేందుకు పేమెంట్ గేట్ వే అంగీకరించి మంగళవారం వారి డబ్బును ఖాతాకు బదిలీ చేసింది. పోయిన డబ్బు తిరిగి రావడంతో మేఘన, ఆమె భర్త ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.