Cyberabad Police : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Stephen Ravindra
Cyberabad Police : హైదరాబాద్ నగరంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ….. నిందితులకు 39 కేసుల్లో ప్రమేయం ఉందని చెప్పారు.
ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు సయ్యద్ మోసిన్ తో పాటు శంకర్ చౌహాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. సయ్యద్ మోసిన్ వద్ద నుంచి 73 తులాల బంగారం, 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు.
Also Read : Fake Insurance Policy : నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేస్తున్నముఠా అరెస్ట్
శంకర్ చౌహాన్ పై 11 కేసులు ఉన్నాయని తెలిపిన స్టీఫెన్ రవీంద్ర…అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.