Fake Insurance Policy : నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేస్తున్నముఠా అరెస్ట్

వరంగల్ ఆర్టీఏ  కార్యాలయం సిబ్బంది సహాకారంతో   వాహనాలకు  నకిలీ ఇన్స్యూరెన్స్‌ పట్టాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Insurance Policy : నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేస్తున్నముఠా అరెస్ట్

Duplicate Insurence Poiicy Scam

Fake Insurance Policy : వరంగల్ ఆర్టీఏ  కార్యాలయం సిబ్బంది సహాకారంతో   వాహనాలకు  నకిలీ ఇన్స్యూరెన్స్‌ పట్టాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. అమాయకులను బురిడీ కొట్టి అడ్డంగా దోచుకుంటున్న అక్రమార్కులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఫోర్స్, మిల్స్ కాలనీ, ఇంతేజారగంజ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లు పట్టుబడ్డారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు సర్టిఫికెట్స్ మార్ఫింగ్ చేస్తున్న జిరాక్స్ సెంటర్స్ పై పోలీసుల దాడులు చేశారు. నిందితుల నుండి 4లక్షల 46వేల రూపాయల  నగదు, 3 ల్యాప్ ట్యాప్‌లు, 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ భీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిం దితులందరు కుడా వాహన భీమా మరియు రోడ్డు రవాణా శాఖ దళారీలుగా వరంగల్ రోడ్డు రవాణా శాఖ కార్యాలయము పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని వరంగల్ పోలీసు కమీషనర్ డా.తరుణ్ జోషి తెలిపారు. నిందితులు గత రెండేళ్లుగా ఈ దందా నిర్వహిస్తున్నారని తెలిపిన వరంగల్ పోలీసు కమీషనర్ నిందితులు ఏవిదంగా మోసం చేశారో వివరించారు.

నిందితులందరు వాహనదారులకు అవసరమయిన వాహన భీమాకు సంబంధించి రెన్యూవల్ చేయించడం, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్లను ఇప్పించడం చేసేవారు. ఈ విధంగా నిందితులను వచ్చే అదాయం సరిపోకపోవడంతో నిందితులు నకిలీ భీమా రెన్యూవల్స్ పై దృష్టి సారించారు. ఇందుకోసం నిందితులు వివిధ రకాల యాప్స్ మరియు సాఫ్ట్వేర్లను సేకరించారు.

ముందుగా తమ వద్దకు వాహన భీమా రెన్యూవల్ చేయించుకోనేందుకు వచ్చేవారిలో అమాయకంగా కనిపించే వారికి నిందితులు ముందుగా రెన్యూవల్ చేయాల్సిన అసలు భీమా పత్రాన్ని ఫోటోను యాప్స్ మరియు సాఫ్ట్ వేర్   ద్వారా అసలు భీమా పాలసీ పత్రంలో సమాచారాన్ని సవరించడంతో పాటు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన దొరకకుండా వుండేందుకు గాను ఆండ్రాయిడ్ యాప్‌లతో క్యూఆర్ కోడ్లను రూపొందించిన నిజమైన బీమా పాలసీ పత్రంగా రూపొందించి వాహనదారులకు అందజేసేవారు.

ఈ విధంగా నిందితులు   ప్రైవేట్ వాహన భీమా సంస్థలకు సంబంధించి నకిలీ బీమా పాలసీ రెన్యూవల్స్ చేసారు. ఇందుకోసం వాహనదారుల నుండి 2వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు వసూలు చేసేవారు. ఈ విధంగా నిందితులు గత రెండు సంవత్సరాలుగా ఈ నకిలీ వాహన బీమా పాలసీ రెన్యూవల్స్ చేస్తూ వస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం నిందితుల వద్ద వాహన బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకున్న వాహనదారుడి వాహనం ప్రమాదానికి గురి అయ్యింది. బీమా సంస్థ ద్వారా తన వాహనానికి మరమ్మత్తులు నిర్వహించేందుకు గాను సదరు వాహనదారుడు బీమా సంస్థను సంప్రదించగా వాహనం యొక్క బీమా పాలసీ రెన్యూవల్ చేయని కారణంగా బీమా క్లయిం వర్తించదని సంస్థ సిబ్బంది తెలపారు. దీంతో కంగుతిన్న వాహనదారుడు తాను మోసపోయినట్లుగా గుర్తించి వరంగల్ టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందించడంతో పాటు ఇంతేజాగంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేశాడు.
Also Read : Shilpa Chowdary : శిల్పాచౌదరి కేసులో బయటకు వస్తున్న బాధితులు
వాహనదారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇంతేజాగంజ్ మరియు మిల్స్ కాలనీ పోలీసులతో కల్సి నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.  పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు చేసిన మోసాన్ని అంగీకరించడంతో పాటు, రోడ్డు రవాణా శాఖ కార్యాలయములో విధులు నిర్వహించే సిబ్బంది అనధికారికంగా అందజేసిన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖ అధికారికి సంబంధించిన రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఇప్పటి వరకు 2వేల నుండి పదివేల మంది వాహనదారులను మోసం చేయడంతో పాటు సూమారు 90లక్షల రూపాయలు ప్రభుత్వ అదాయానికి గండి కోట్టారని పోలీసుల విచారణలో తేలింది.