Shilpa Chowdary : శిల్పాచౌదరి కేసులో బయటకు వస్తున్న బాధితులు

శిల్పాచౌదరి చీటీంగ్ కేసులో బాధితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు.

Shilpa Chowdary : శిల్పాచౌదరి కేసులో బయటకు వస్తున్న బాధితులు

Silpa Chowdary

Shilpa Chowdary :  శిల్పాచౌదరి చీటీంగ్ కేసులో బాధితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. శిల్పా చౌదరి ఖాకీలకి చిక్కిన విషయం తెలిసాక ఎందరో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదుల సతీమణులు, పెద్ద స్థాయి పోలీసు వర్గాల కోడళ్లు అనేకమంది ఒక్కోక్కరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అధిక డబ్బులు ఆశ చూపించి కోట్లల్లో వారి వద్ద డబ్బులు కొల్లగొట్టిన శిల్పా చౌదరిపై విచారణ జరిపేందుకు పోలీసులు మరింత లోతుగా బాధితుల నుండి సమాచారం సేకరిస్తున్నారు.

ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో కుటుంబం రూ. 12 కోట్లు శిల్పా చౌదరిని నమ్మి మోసపోయారు. ఒక్కోక్కరి దగ్గర 6 కోట్లు చొప్పున 12 కోట్లు ఇద్దరి వద్ద నుండి శిల్పా చౌదరి వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో వైపు ఓ పోలీసు ఉన్నతాధికారి దగ్గర 6 కోట్లు, కీలక స్థానంలో ఉన్న న్యాయమూర్తి కుటుంబ సభ్యుల వద్ద నుండి రూ.5 కోట్లు వ్యాపారం పేరుతో శిల్పా చౌదరి దండుకుంది.

రెండు నెలల క్రితం సనత్ నగర్‌కి చెందిన సుమంత్ అనే వ్యక్తి రూ. 15 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత శిల్పా చౌదరి వార్తలు మీడియాలో చూసిన సుమంత్, సనత్ నగర్‌లో ఫిర్యాదు చేశాడు. శిల్పా చౌదరి సంపన్నుల మహిళలను టార్గెట్ చేస్తూ, తన విల్లాకు పిలిపించి కిట్టి పార్టీలతో పాటు పేకాట నిర్వహించి, వారికి ఖరీదైన మద్యం సరఫరా చేసి వారిని నమ్మించినట్టు సమాచారం.
Also Read :Ghaziabad : భర్త ఆఫీసుకు-ప్రియుడికి నగ్న వీడియో కాల్ చేస్తున్న భార్య
సంపన్నుల మహిళలు తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీ‌ని, వైట్‌మనీ‌గా మార్చడానికి కోట్లలో ఇచ్చారు. అలా డబ్బులు ఇచ్చిన మహిళలు ఇప్పుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెనకడుగేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఆ దిశగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. శిల్పా‌ చౌదరి భర్త శ్రీనివాస్ ఓ ప్రైవేట్ సంస్థ లో రీజినల్ డోరెక్టర్ గా పని చేస్తున్నారు. భార్య చేస్తున్న మోసాలో పాలు పంచుకుని, వచ్చిన డబ్బుతో నగరంలో భూములు కొని వెంచుర్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. శిల్పా చౌదరి, భర్త శ్రీనివాస్ కేసుకి సంబంధించి ఉప్పర్పల్లి కోర్ట్‌లో వాదనలు జరగగా, రేపటి వరకు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కోర్టు రిజర్వ్ చేసింది.