చిత్తూరు అడవుల్లో గుప్త నిధుల కోసం నరబలికి యత్నం : బైటపడుతున్నకొత్తకోణాలు..!!

  • Publish Date - February 20, 2020 / 08:06 AM IST

గుప్త నిధుల కోసం ఓ మనిషిని బలి ఇచ్చేందుకు యత్నించారు కొంతమంది. చిత్తూరు జిల్లాలోని అడవుల్లో.. గుప్తనిధుల తవ్వకాల్లో బైటపడుతున్న కొత్తకోణాలు బైటపడుతుండటంతో ఈ దారుణాలపై స్థానికులు తీవ్ర భయభ్రాంతుకులకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసం నన్ను బలి ఇచ్చేందుకు యత్నించారనీ..గణేష్ అనే వ్యక్తి  తలపై కర్పూరం పెట్టి వెలిగించారనే వార్తల్లో నిజమెంత? స్వామీకీ గాయాలు ఎందుకు అయ్యాయి? నిజంగా  గణేష్ ను నరబలి ఇచ్చేందుకు యత్నాలు జరిగాయా? అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కేసులో రోజుకో విషయాలు బైటపడుతున్నాయి. విద్యుత్ షాక్ వల్లనే గణేష్ కు గాయాలైనాయి తప్ప అతన్ని బలి ఇవ్వటానికి యత్నించారనే మాటల్లో నిజం లేదని..గణేస్ కు కరెంట్ తీగలవల్లనే గాయాలయ్యాయి అని  పోలీసులు అంటున్నారు. కానీ అసలు అడవిలో కరెంట్ తీగలే లేవని అటవీశాఖ  అధికారులు అంటున్నారు. దీంతో నరబలి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు నరబలికి ప్రయత్నం జరిగిందా?బాధితుడు గణేష్ కు దెబ్బలెలా తగిలాయి. విద్యుత్ షాక్ తగిలి కాలికి గాయమైందా?లేక గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠా సభ్యులకే గణేష్ పై దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు కూపీలాగుతూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. 

వివరాలిలా ఉన్నాయి : చిత్తూరు జిల్లాలోని దొడ్డిపల్లిలో గుప్త నిధుల కోసం ఏడుగురు ముఠా తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాల కోసం గణేష్ అనే వ్యక్తిని అడవిలోకి తీసుకుళ్లారు సదరు ముఠా. అలా అడవిలోకి వెళ్లిన తరువాత తమిళనాడుకు చెందిన ఓ స్వామీజీతో పూజలు చేయించారు. తరువాత గణేష్ ను నరబలి ఇద్దామనుకున్నారు. దీంట్లో భాగంగా గణేష్ కు మాయమాటలు చెప్పి అతని తలపై కర్పూరం వెలిగించి సజీవంగా దహనం చేయటానికి యత్నించారు. దీంతో భయపడిపోయిన గణేష్ వారి నుంచి తప్పించుకుని కాలిన గాయాలతో  బతికి బైటపడ్డాడు. 

ఈ ఘటనపై పోలీసులు చికిత్స పొందుతున్న గణేష్ కొద్దిగా కోలుకున్నాక అసలు ఏం జరిగిందని ప్రశ్నించారు. దానికి గణేష్ నాకేం తెలీదు..నాకేం గుర్తు లేదని చెబుతున్నాడు.  తనకు గాయాలు ఎలా అయ్యాయో తెలీదని అంటున్నాడు. కాగా..గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయనేది వాస్తవం. కానీ ఎవ్వరూ విషయాన్ని బైటకు చెప్పటంలేదు. పోలీసులు మాత్రం గణేష్ కు  అడవిలో ఉండే విద్యుత్ తీగలు షాక్ తగిలి గాయాలయ్యాయి అంటున్నారు. మరోపక్క ఫారెస్ట్ అధికారులు మాత్రం అసలు దొడ్డిపల్లి అడవుల్లో విద్యుత్ తీగలే లేవంటున్నారు. దీంతో గుప్తనిధుల తవ్వకాల కేసు పలు మలుపులు తిరుగుతోంది. పోలీసులు అప్పటికే ముఠాలోని ఇద్దరు సభ్యులకు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. 

హరీష్ రెడ్డి, గురుప్రసాద్,రమేష్, చెన్నైకు చెందిన స్వామీజీజయకుమార్ లతో కలిసి గణేష్ అడవికి వెళ్లాడు. అలా వెళ్లినవారు నరబలి ఇచ్చే క్రమంలో ముఠా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిందా? ఆ గొడవ పెద్దైందా? అదంతా ఉత్త ఘర్షణే అయితే గణేష్ కు గాయాలు ఎందుకు తగిలాయి? పోలీసులకు ఇద్దరు చిక్కగా మిగతా ముఠా సభ్యులు ఎక్కడున్నారు? వాళ్లకు కూడా గాయాలయ్యాయా? వాటిని వారు గోప్యంగా ఉంచుతున్నారా? లేదా? అసలు  గణేష్ ను నరబలి గురించి చెప్పే తీసుకెళ్లారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటిపై దర్యాప్తు కొనసాగుతోంది.