కలకలం : యూనివర్సిటీ క్యాంపస్‌లో నవ దంపతులు ఆత్మహత్య

  • Publish Date - May 5, 2019 / 10:59 AM IST

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీర్బం జిల్లాలోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం క్యాంపస్ లో కలకలం రేగింది. వర్సిటీ క్యాంపస్ లో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. క్యాంపస్ లోని చీనా భవన్ ( చైనా భాషా సాంస్కృతిక శాఖ) దగ్గర పోలీసులు కొత్త జంట మృతదేహాలను గుర్తించారు. వీరిని సోమనాధ్ మహతో (18) అవంతిక (19) గా గుర్తించారు. వీరు ఇటీవలే వివాహం చేసుకున్నట్లు తెలిసింది. 

మృతులు బోల్పూర్ లోని శ్రీనంద హైస్కూల్ విద్యార్దులు. సోమనాధ్.. హయ్యర్ సెంకడరీ పరీక్షలకు హాజరవ్వగా, అవంతిక 10వ తరగతి పరీక్షలు రాసింది. అర్ధరాత్రి వేళ వారు క్యాంపస్ లోకి ఎలా వచ్చారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించినా.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్నారు.