ఓటుకు నోటు కేసు : వేం నరేందర్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ

  • Publish Date - February 12, 2019 / 08:20 AM IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వెం నరేందర్ రెడ్డి ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల లెక్కల పై ఈడీ అధికారులు నరేందర్ రెడ్డిని ప్రశ్నస్తున్నారు.  మిగిలిన నాలుగున్నర కోట్లు ఎక్కడ అని ప్రశ్నల నరేందర్ పై అధికారులు  ఆరా తీస్తున్నారు. 

ఐ.టి,ఏ.సి.బి శాఖ ఇచ్చిన సమాచారం తో , బ్యాంక్ అకౌంట్స్ ముందు ఉంచి  నరేందర్ ను  అధికారులుప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు లో రేవంత్ రెడ్డి,ఉదయ సింహను ఈడీ  విచారించింది. మంగళవారం కుమారుడు తో కలసి  నరేందర్ రెడ్డిఈడీ కార్యాలయంకు వచ్చారు.