Crorepati Anganwadi Worker : కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టిన అంగన్‌వా‌డి కార్యకర్త

అంగన్‌వా‌డీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు.

Crorepati Anganwadi Worker : అంగన్‌వా‌డీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. ఒడిషాలోని భువనేశ్వర్ నగరంలోని కొరొడొకొంటా అంగన్వాడీ కేంద్రం కార్యకర్త కబితా మఠాన్‌ రూ.4 కోట్లు పైగా విలువైన ఆస్తులను సంపాదించినట్లు విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు.

ఖుర్దా, కేంద్రాపడా, జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాల్లో మొత్తం ఆరు చోట్ల ఒకేసారి సోదాలు చేపట్టిన అధికారులు అక్రమాస్తుల చిట్టాని వెలుగులోకి తీసుకువచ్చారు. అంగన్వాడీ కార్యకర్త ఆస్తుల గుట్టు రట్టు చేయడంలో 6 బృందాలు పాల్గొనగా, వీరిలో 10 మంది డీఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. కబితా మఠాన్ 4 భవనాలు, 10 ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కారు, విలువైన బంగారు ఆభరణాలను ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో భువనేశ్వర్‌లో 4 అంతస్తుల భవనం ఒకటి, 3 అంతస్తుల భవనం మరొకటి, 2 రెండంతస్తుల భవనాలు ఉన్నాయి.

Read Also : Love Cheating : సోషల్ మీడియాలో పరిచయం-పెళ్లి అనే సరికి పరారైన ప్రియుడు
అలాగే జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉండగా, రూ.2.20 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు…. బ్యాంకు ఖాతాలు…. రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారు ఆభరణాలు, పలు స్థిర చరాస్తులు ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారుల దాడిలో గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేశాయి.

ట్రెండింగ్ వార్తలు