On camera, youth brutally beats up girl in Madhya Pradesh
Viral Video: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక యువతిని ఒక వ్యక్తి కిందపడేసి కిరాతకంగా కొట్టాడు. ముఖంపై తన్నుతూ, ఏమాత్రం జాలి చూపకుండా అమానుషంగా దాడి చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ విషయమై సమాచారం అందుకున్న రేవా పోలీసులు, దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Bharat Jodo Yatra: కుక్కలు, పందులు, గేదెలు కూడా వచ్చాయి.. భారత్ జోడో యాత్రపై రాహుల్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని మౌగంజ్ ప్రాంతానికి చెందినదని, ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగినట్లు పేర్కొన్నారు. దాడికి గల కారణాలపై భిన్న ప్రచారం జరుగుతోంది. కొందరేమో పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు సదరు యువతిపై దాడికి పాల్పడినట్లు అంటున్నారు. వారు కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని, అయితే తాజాగా పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తీసుకురావడంతో ఈ విధంగా దాడికి పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది.
इस राक्षस को धारा 151 की खानापूर्ति करके छोड़ दिया एमपी के रीवा की पुलिस ने!
परिवार अगर खूंखार के खौफ से शिकायत नहीं करवाएगा,तो क्या पुलिस इससे भी खौफनाक अगली वारदात के लिए राक्षस को आजाद छोड़ देगी!वीडियो देखें,बताएं क्या ये घटना 151 की है.!@ChouhanShivraj @drnarottammisra pic.twitter.com/DUr9k44oue— Govind Gurjar (@Gurjarrrrr) December 24, 2022
ఇక మరికొందరు చెప్పే విషయం వేరేలా ఉంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు స్నేహితులని, అయితే యువతి వేరే ఇంకెవరితోనో మాట్లాడంపై తీవ్ర కోపానికి గురైన యువకుడు, యువతిపై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. వీడియో ప్రకారం.. దెబ్బలకు తాళలేక యువతి మూర్చపోయేంత వరకు కొట్టాడు. అంనతరం స్పృహ తప్పిన ఆమెను పట్టి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ దుర్మార్గాన్ని నిందితుడి ఆపకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనంతరం ఇది వైరల్గా మారింది.
MCD: దమ్ముంటే ఎదురుగా వచ్చి పోటీ చేయండి.. ఢీల్లీ మేయర్ ఎన్నికపై బీజేపీకి ఆప్ ఛాలెంజ్
ఈ విషయమై రేవా జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వివేల్ లాల్ స్పందిస్తూ.. ‘‘వీడియో ఆధారంగా నిందితుడిని పట్టుకున్నాం. సదరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అలాగే బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నాం. వీడియో తీసిన స్నేహితుడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని తెలిపారు.