ఘోర ప్రమాదం : రావిరాల వద్ద ఇద్దరు మృతి

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 01:25 AM IST
ఘోర ప్రమాదం : రావిరాల వద్ద ఇద్దరు మృతి

రంగారెడ్డి : జిల్లా రావిరాల అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సువర్ణ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారు డ్రైవర్‌ నర్సింగరావు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.  ఆదిభట్ల నుంచి తుక్కుగూడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులు జల్‌పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. అమృతమ్మ అనే మరో మహిళకు తీవ్రంగా గాయలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.