Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో అగ్నిప్రమాదం.. 700 షాపులు దగ్ధం

అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక ప్రాంతంలోని దాదాపు 700 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్, నహల్రాగన్ ప్రాంతంలో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇటానగర్, నహల్రాగన్ ప్రాంతంలో అనేక వ్యాపార సముదాయాలు ఉంటాయి.

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ

అయితే, మంగళవారం రెండు షాపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు రెండు గంటలు ప్రయత్నించారు. కానీ, మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. పైగా, ఈ మంటలు వేరే షాపులవైపు వ్యాపించాయి. క్రమంగా ఈ ప్రాంతంలోని అన్ని షాపులవైపు మంటలు చెలరేగాయి. మొత్తం 700 షాపులు అగ్నిప్రమదానికి గురైనట్లు సమాచారం. ఈ మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది విఫలమయ్యారు.

దీంతో 700 షాపులు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. షాపులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాల్ని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద నష్టం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.