పాపువా న్యూ గినియాలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఇటీవల పోలీసులతో పాటు ఇతర ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం తగ్గుదల కనపడింది. దీంతో వారంతా నిరసనలకు దిగడంతో అదే సమయంలో ఆ దేశ రాజధాని పోర్ట్ మోర్స్బీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు కూడా నిరసనలకు దిగడంతో ఇక అడిగేవారు లేరని చాలా మంది సూపర్ మార్కెట్లకు వెళ్లి అందులోని వస్తువులన్నింటినీ దోచుకువెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయి. సూపర్ మార్కెట్ల నుంచి ఎంతగా ఎత్తుకెళ్లే అవకాశం ఉందో అంతగా దోచుకెళ్లారు స్థానికులు.
వందలాది మంది దోచుకోవడానికి వచ్చిన తీరు విస్మయం కలిగిస్తోంది. సూపర్ మార్కెట్లోకి ప్రవేశించాక ఏ వస్తువు కంటికి కనపడితే దాన్ని తీసుకుని వెళ్లిపోయారు. విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. మరోవైపు నిరసనకారులు కొన్ని దుకాణాలను ధ్వంసం చేశారు. వందలాది మంది నిరసనలు చేపట్టడంతో శాంతి, భద్రతల సమస్య తలెత్తింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది.
Actor Radhika Apte : ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో పడ్డ ఇబ్బందులు షేర్ చేసుకున్న నటి..