Actor Radhika Apte : ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో పడ్డ ఇబ్బందులు షేర్ చేసుకున్న నటి..

నటి రాధిక ఆప్టే రీసెంట్‌గా తను ఎక్కాల్సిన విమానం ఆలస్యంగా బయలుదేరడంతో ఇబ్బందులు పడ్డారు. తను ఫేస్ చేసిన కష్టాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Actor Radhika Apte : ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో పడ్డ ఇబ్బందులు షేర్ చేసుకున్న నటి..

Actor Radhika Apte

Updated On : January 13, 2024 / 4:29 PM IST

Actor Radhika Apte : నటి రాధిక ఆప్టే ఎక్కాల్సిన  ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎదురైన ఇబ్బందులను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. ఎక్కడ?  ఏ విమాన సర్వీసు?  వంటి వివరాలను మాత్రం రాధిక  చెప్పలేదు. ప్రయాణికులను ఏరో‌బ్రిడ్జ్ లోపల లాక్ చేయడంతో మంచినీరు కూడా దొరక్క ఇబ్బంది పడినట్లు ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Dil Raju : ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కారు.. సినిమా బాగుంటే చూస్తారు, ఆపలేరు..

నటి రాధిక ఆప్టే తను ఎక్కాల్సిన ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్ పోర్టులో ఎదుర్కున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్ 8.30 గంటలకు బయలుదేరాలట. 10.50 గంటలు అయినా ఫ్లైట్ కదలలేదట. ఫ్లైట్ ఎక్కుతున్నాం అని చెప్పి ప్రయాణికులందరినీ ఏరోబ్రిడ్జిలోకి తీసుకెళ్లి సిబ్బంది లాక్ చేసినట్లు నటి రాధిక పోస్టులో రాశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు. తాము లాక్ చేయబడిన డోర్ వెనుక చాలామంది ప్రయాణికులు ఉన్న వీడియో క్లిప్‌ను రాధిక షేర్ చేసారు. ఈ వీడియోలో కొందరు ప్రయాణికులు ఏరోబ్రిడ్జిలో సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడుతున్నట్లు కనిపించింది.

Guntur Kaaram : అదరగొట్టిన ‘గుంటూరు కారం’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?.. రీజనల్ సినిమాతోనే బాబు రికార్డు..

కనీసం మధ్యాహ్నం 12 గంటల వరకు తాము అక్కడే ఉండాలని సిబ్బంది చెప్పినట్లు రాధిక తన పోస్టులో రాశారు. లోపల లాక్ చేయబడ్డా.. మంచినీరు కూడా లేకపోయినా సరదా ప్రయాణానికి ధన్యవాదాలు.. అంటూ రాధిక ఆప్టే తన పోస్టులో రాసారు. అయితే సిబ్బందిని మార్చాల్సి వచ్చిందని… కొత్త సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో ప్రయాణం ఆలస్యమైందని సిబ్బంది చెప్పారట. మొత్తానికి రాధిక విమాన కష్టాలు మామూలుగా లేవు.  రాధిక ఆప్టే రీసెంట్ రిలీజ్ ‘మెర్రీ క్రిస్మస్’ లో గెస్ట్ రోల్‌లో నటించారు. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి నటించిన సినిమా హిట్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)