Dil Raju : ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కారు.. సినిమా బాగుంటే చూస్తారు, ఆపలేరు..
గుంటూరు కారం సినిమా రిలీజ్ ముందు నుంచి వైరల్ అవుతుంది.

Dil Raju Comments on Mahesh Babu Guntur Kaaram Movie Talk and Reviews
Dil Raju : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా నిన్న జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రిలీజయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పండక్కి దూసుకెళ్లిపోతుంది. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటున్నారు అభిమానులు. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలు జోడించి అదరగొట్టారు.
అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ ముందు నుంచి వైరల్ అవుతుంది. ఎక్కువ థియేటర్స్ ఈ సినిమాకే బ్లాక్ చేశారని, వేరే సినిమాలకి థియేటర్స్ ఇవ్వట్లేదని ఇష్యూ నడిచింది. ఇక రిలీజ్ తర్వాత కూడా కొంతమంది సినిమా అంత గొప్పగా లేదని, యావరేజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సినిమాలో కొన్ని సీన్స్, సినిమా అబాగోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా గుంటూరు కారం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత నాగ వంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని సినిమా గురించి మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ.. గుంటూరుకారం మిడ్ నైట్ షో తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. నేను నా అంచనాను క్రాస్ చెక్ చేసుకోడానికి సుదర్శన్ లో మళ్ళీ చూశాను. అక్కడ రెస్పాన్స్ అదిరిపోయింది. బాగా లేదనే ప్రచారంతో ప్రేక్షకులు నెగిటివ్ మైండ్ తో వెళ్తున్నా, సినిమా వాళ్ళని ఎంటర్టైన్ చేసి మెప్పిస్తుంది. గతంలో చాలా సినిమాలు ఇలాగే మొదట డివైడ్ టాక్ వచ్చినా తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యాయి. పూర్తిగా సినిమా చూసిన వాళ్లంతా బాగా కనెక్ట్ అయి పాజిటివ్ గా చెబుతున్నారు. సినిమా వసూళ్లు పూర్తిగా పండుగ తర్వాత వస్తాయి. సినిమా బాగుంటే చూస్తారు, ఎవరూ ఆపలేరు. సినీ పరిశ్రమలో ఎవరికి ఎవరు శత్రువులు కారు. సినిమాకు నెగిటివ్ టాక్ బాగా కలెక్షన్స్ వచ్చినప్పుడు పోతుంది. పండగ ఇంకా మూడు రోజులు ఉంది, కలెక్షన్స్ బాగా వస్తాయి అని అన్నారు.
ఇక నిర్మాత నాగవంశీ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఎవరు చెప్పింది నమ్మకండి. మీరే వచ్చి సినిమా చుడండి. ఇది పండగ సినిమా, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. నాది గ్యారెంటీ అని అన్నారు.