Guntur Kaaram : అదరగొట్టిన ‘గుంటూరు కారం’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?.. రీజనల్ సినిమాతోనే బాబు రికార్డు..
కలెక్షన్స్ విషయంలో కూడా అదరగొడుతుంది గుంటూరు కారం. ఎక్కువ షోలతో ఆల్రెడీ సరికొత్త రికార్డ్ సెట్ చేసిన గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్స్ లో కూడా రికార్డ్ సెట్ చేసింది.

Trivikram MaheshBabu Guntur Kaaram Movie First Day Collections Details
Guntur Kaaram Collections : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా నిన్న జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటున్నారు అభిమానులు. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలు జోడించి అదరగొట్టారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఈశ్వరరావు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
కలెక్షన్స్ విషయంలో కూడా అదరగొడుతుంది గుంటూరు కారం. ఎక్కువ షోలతో ఆల్రెడీ సరికొత్త రికార్డ్ సెట్ చేసిన గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్స్ లో కూడా రికార్డ్ సెట్ చేసింది. గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక్క భాషలోనే రిలీజయిన ఓ రీజనల్ సినిమా మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. గతంలో మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా మొదటి రోజు 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పుడు రీజనల్ సినిమా రికార్డ్ సెట్ చేయగా మళ్ళీ ఇప్పుడు మహేష్ గుంటూరు కారంతోనే ఆ రికార్డు బద్దలు కొట్టడం విశేషం.
Also Read : Prabhas-Maruthi : ప్రభాస్-మారుతి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అప్పుడే.. డేట్, టైమ్ ఫిక్స్
ఇక అమెరికాలో కూడా గుంటూరు కారం సినిమా ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి దూసుకెళ్తుంది. పండగ ఇంకో మూడు రోజులు ఉండటంతో గుంటూరు కారం కలెక్షన్స్ 250 కోట్ల పైన దాటొచ్చు అని అభిమానులు భావిస్తున్నారు.
Biggest opening day ever for the Reigning Super ? @urstrulyMahesh ??#GunturKaaram strikes a ?????? ???????? ?? ?? ????? Worldwide on Day 1 ~ ??? ???? ?????? in regional cinema! ??
Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/TNNMBjVLeI
— Haarika & Hassine Creations (@haarikahassine) January 13, 2024