Prabhas-Maruthi : ప్రభాస్-మారుతి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అప్పుడే.. డేట్, టైమ్ ఫిక్స్

ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‌కి డేట్, టైమ్ ఫిక్స్ అయ్యింది. ఆ వివరాలను ఈ సినిమా నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Prabhas-Maruthi : ప్రభాస్-మారుతి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అప్పుడే.. డేట్, టైమ్ ఫిక్స్

Prabhas-Maruthi

Updated On : January 13, 2024 / 2:34 PM IST

Prabhas-Maruthi : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’‌తో సూపర్ హిట్ కొట్టారు. నెక్ట్స్ ప్రాజెక్టు కల్కితో భారీ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు మారుతితో చేస్తున్న మూవీ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ సినిమా నుండి అప్ డేట్ వచ్చింది.

Ram Charan : బెంగళూరుకి మెగా ఫ్యామిలీ.. సంక్రాంతి వేడుకలకు కూతురితో వెళ్తున్న చరణ్, ఉపాసన

ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్.. వివరాలు ఇప్పటివరకు గోప్యంగా ఉన్నాయి. స్టోరీ మాత్రం హారర్ నేపథ్యంలో ఉంటుందని ఇటీవల ప్రభాస్ రివీల్ చేసారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ  సినిమా  టైటిల్, ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసారు. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అని పేరు పెట్టినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 15 న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Saindhav Review : ‘సైంధవ్‌’ మూవీ రివ్యూ.. కూతురు కోసం వెంకీమామ విధ్వంసం..

జనవరి 15 న సంక్రాంతి పండుగ నాడు ఉదయం 7.08 గంటలకు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ఈ సినిమా నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా అప్ డేట్ గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ అభిమానులకు ఆరోజు టైటిల్ రివీల్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారని తెలుస్తోంది.