Ram Charan : బెంగళూరుకి మెగా ఫ్యామిలీ.. సంక్రాంతి వేడుకలకు కూతురితో వెళ్తున్న చరణ్, ఉపాసన
మెగా ఫ్యామిలీ ఈసారి సంక్రాంతి వేడుకల్ని బెంగళూరులో జరుపుకుంటోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో బెంగళూరు బయలుదేరారు.

Ram Charan
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఈసారి సంక్రాంతి వేడుకలను బెంగళూరులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో బెంగళూరుకి బయలుదేరారు.

Ram Charan 1
ఏటా మెగా స్టార్ కుటుంబం ఒకచోట చేరి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటుంది. మెగా హీరోలంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. గతంలో బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సంక్రాంతి పండుగ జరుపుకున్న వీరంతా ఈ ఏడాది బెంగళూరులో పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ బెంగళూరు బయలుదేరారు. భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో ఎయిర్ పోర్టులో కనిపించారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram Charan : గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్, బ్రహ్మానందం ఫొటో.. చరణ్ కొత్త లుక్ చూశారా?
కాగా రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Ram Charan 2