Pastor Praveen Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో విచారణను దర్యాఫ్తు బృందం మరింత వేగవంతం చేసింది. విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణంపై దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు ఈ జర్నీలో ఆయన ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఏలూరులో మార్చి 24న రాత్రి 10 గంటల 12 నిమిషాలకు ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. మద్యం షాపునకు ఫోన్ పే ద్వారా 350 రూపాయలు చెల్లించినట్లుగా ఆధారాలు సేకరించారు పోలీసులు.
మార్చి 24న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు తన బుల్లెట్ పై రాజమండ్రి బయలుదేరారు. ఈ క్రమంలో కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గర ప్రవీణ్ చనిపోయి కనిపించారు. ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయి. ప్రవీణ్ మృతి మిస్టరీగా మారింది. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
Also Read : కొడాలి నాని హెల్త్ అప్‌డేట్… ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు
ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని ఆరోపించాయి. దీంతో ఈ కేసుని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నారు. అసలేం జరిగింది? పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారు? ఆయన మృతికి కారణం ఏంటి? అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ టు రాజమండ్రి ప్రయాణం.. ఆ 3 గంటలు ఏం జరిగింది..
* మార్చి 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై పాస్టర్ ప్రవీణ్ ప్రయాణం
* మ.1.29కి చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గరకు చేరుకున్న పాస్టర్ ప్రవీణ్
* మ.2.14 కి నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నారు
* మ.3.31కి చిల్లకల్లు టోల్ గేట్ ను క్రాస్ చేశారు
* మ.4.07కి కీసర టోల్ గేట్ ను క్రాస్ చేశారు
* 4.45కి గొల్లపూడిలో పెట్రోల్ బంద్ దగ్గరికి చేరుకున్నారు
* 4.47కి బంక్ లో పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా చెల్లింపు
* సా.5కి విజయవాడ చేరుకున్న పాస్టర్ ప్రవీణ్
* 5.10 కి కనకదుర్గ వంతెన, వారధి మీదుగా బెంజ్ సర్కిల్ కు చేరిక
* 5.20కి రామవరప్పాడు రింగ్ రోడ్ దగ్గర కాసేపు ఆగారు