టిక్‌టాక్‌లో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు : యువకుడి అరెస్ట్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ని దూషించిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు టిక్‌టాక్‌ లో కేసీఆర్‌

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 08:23 AM IST
టిక్‌టాక్‌లో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు : యువకుడి అరెస్ట్

Updated On : April 24, 2019 / 8:23 AM IST

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ని దూషించిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు టిక్‌టాక్‌ లో కేసీఆర్‌

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ని దూషించిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు టిక్‌టాక్‌ లో కేసీఆర్‌ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. దారుణంగా తిట్టాడు. ముఖ్యమంత్రిని అవమానించే విధంగా వీడియోను చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోని డిలీట్ చేయించారు. అత్యున్నత పదవుల్లో ఉన్నవారిని దూషించడం, వారి గురించి అభస్యకరంగా మాట్లాడటం చట్టరిత్యా నేరం. అలాంటి పనులను చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సోషల్ మీడియాలో ప్రధానిని దూషించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి. చైనాకు చెందిన కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. ఈ యాప్ పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. దీని ద్వారా అశ్లీల వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని.. యువత, పిల్లలు చెడిపోతున్నారనే ఆందోళన వ్యక్తమైంది. దీంతో భారత్ లో ఈ యాప్ ని బ్యాన్ చేశారు. గూగుల్, యాపిల్ తమ ప్లే స్టోర్స్ నుంచి టిక్ టాక్ ను తొలగించాయి. కొత్తగా ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోలేరు..కానీ.. ఆల్రెడీ ఉన్నవాళ్లు మాత్రం వినియోగించుకునే అవకాశం ఉంది.