Ganja Smuggling
Ganja Smuggling : గంజాయి స్మగ్లింగ్ కేసులో ఒక బ్యూటీషియన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉయ్యూరుకు చెందిన హలీ మున్నీసా అనే మహిళకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త పిల్లలను వదిలేసి కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు సంతరోడ్డులో ప్రియుడు సాదిక్ తో కలిసి బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది.
వీరిద్దరూ గత కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల సాదిక్ ను పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సాదిక్ చెప్పిన వివరాల ప్రకారం హలీ మున్నీసా బ్యూటీపార్లర్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు.
Also Read : Accused Escaped : పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన నిందితుడు
పోలీసులు బ్యూటీషియన్ మున్నీసా ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచిన 550 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని గుడ్లవల్లేరు ఎస్సై టి.సూర్య శ్రీనివాస్ తెలిపారు.