కొడుకు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు..ఆమెను వదిలించుకోవటానికి అత్తింటివారు అన్ని ప్రయత్నాలు చేశారు. నానా హింసలుపెట్టారు. కొట్టారు..తిట్టారు.అన్నింటిని భరించింది. కానీ ఎంతకూ దీన్ని వదిలించుకోవటం కుదరలేదని అత్తింటివారు కోడలికి దెయ్యం పట్టిందని భూతవైద్యుడితో పూజలు చేయించారు. భూత వైద్యం పేరుతో ఆమెను నానా చిత్రహింసలు పెట్టారు. అది భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు ఆమె అత్తామామలతో పాటు ..గుండిగోపాల్ రావుపేట్ కు చెందిన భూతవైద్యుడిని అరెస్ట్ చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లిలో జరిగింది.
కోడలు పోలీసు కేసు పెట్టిందని అత్తింటివారు భూత వైద్యుడిని తీసుకువచ్చి ఇంట్లో పూజలు చేయిస్తూ..నానా హింసలు పెడుతు..ఈ పోలీసు కేసుల నుంచి బయటపడేలా కోడలికి పట్టిన దెయ్యాన్ని పోగడొతానని చెప్పిన మంత్రగాడి మాటలు నమ్మి కొడలును ఇంట్లోకి రానివ్వలేదు. పూజ సమయంలో వస్తే అరిష్టం అంటూ మెడపట్టుకొని బయటకు గెంటేశారు.
https://10tv.in/black-magic-infront-of-ysrcp-office-in-kuppam/
చిరంజీవి అనే వ్యక్తి రజిత యువతిని వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లి అయి పదేళ్లు అయ్యింది.వాళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ఈక్రమంలో ఇద్దరూ గొడవపడటం మొదలైంది. దీంత కొంత కాలంగా పుట్టింటికి వెళ్లింది రజిత. ఆ తరువాత తన భర్త ఎంతకూ కాపురానికి తీసుకెళ్లకపోవటం..నిర్లక్ష్యం చేయటంతో ఆమె ఆమె అత్తింటివారిపై కేసు పెట్టింది.
ఆమెకు దెయ్యం పట్టడంతోనే కేసు వేసి కుటుంబాన్ని వేదిస్తోందని భూత వైద్యుడిని తెచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు అత్తామామతో సహా అందరూ. ఈ విషయం తెలిసిన రజిత నాకేమీ దెయ్యం పట్టలేదు..మీ కొడుక్కి బుద్ధి చెప్పండి అని కోరింది. దీనికి మా అబ్బాయిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుని వాడినే అంటావా? నీకు పట్టిన దెయ్యం వదిలించానికే పూజలు చేయిస్తున్నామని అన్నారు. నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అరిష్టం ఇంట్లో కి రావద్దంటూ మెడ పట్టుకుని బైటకు గెంటేశారు రజితని. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అత్తా మామలను..భూత వైద్యుని అరెస్ట్ చేశారు.