Constable Suicide : వికారాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య

పోలీసు కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది.

Police Constable Suicide

Constable Suicide : పోలీసు కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. జిల్లాలోని బోంరాస్ పేట పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న డేవిడ్(40) వికారాబాద్ లోని ఎన్నెపల్లిలే నివాసం ఉంటున్నాడు. అతని భార్య హేమలత దేవాదాయ శాఖలో ఉద్యోగం చేస్తోంది.

Also Read : Facebook: ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మార్చిన జుకర్ బర్గ్

గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో డేవిడ్ ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా డేవిడ్ గత నెల రోజులుగా విధులకు హజరు కానట్లు తెలుస్తోంది.