Facebook: ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మార్చిన జుకర్ బర్గ్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కంపెనీకి మార్పులు తీసుకొచ్చారు సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. 2004లో మొదలైన సోషల్ మీడియా దిగ్గజానికి గురువారం జరిగిన కంపెనీ....

Facebook: ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మార్చిన జుకర్ బర్గ్

Facebook

Facebook: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కంపెనీకి మార్పులు తీసుకొచ్చారు సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. గురువారం జరిగిన కంపెనీ వార్షిక సదస్సులో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. కొత్త పేరు మెటాను ప్రకటించారు. ఫేస్‌బుక్‌తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది.

అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉండబోతుందని వెల్లడించారు. ‘ ఫేస్‌బుక్‌ కొత్త పేరు మెటా. తర్వాతి తరం సోషల్‌ మీడియా మెటావర్స్‌ను అందించేందుకు ఈ మెటా సాయపడుతుంది’ అని ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది.

…………………………………….. : శ్రీలంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

కొంత కాలంగా ఫేస్‌బుక్ పర్సనల్ బెనిఫిట్స్ ను టార్గెట్ చేసుకుని యూజర్ డేటాను ట్రాక్‌ చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అమెరికా సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఫేస్‌బుక్ పేరు తరచుగా వార్తల్లోకి వస్తుండటం యూజర్లపై ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావించింది.

ఇటీవల ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి డాక్యుమెంట్లను లీక్‌ చేయడంతో తీవ్ర విమర్శలు వినిపించాయి. మరోవైపు జూకర్‌బర్గ్‌ కొద్దిరోజులుగా మెటావర్స్‌ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వేలాది మందిని ఇదే ప్రయోజనం కోసం నియమించుకున్నారు.