Serial Marriages: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమాయక యువకులే ఆమె టార్గెట్. పెళ్లి చేసుకోవడం.. ఆ వెంటనే డబ్బు, బంగారంతో జంప్ అవడం. ఇదీ ఆమె వాటం. ఇలా.. ఇప్పటివరకు 8 మందిని పెళ్లాడింది ఆ కిలేడీ.
ముత్తిరెడ్డి వాణి అనే మహిళ .. తన మేనత్తతో కలిసి ఘరానా మోసాలకు పాల్పడుతోంది. తన మేనత్త సాయంతో ఇప్పటివరకు 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరిని బురిడీ కొట్టించింది. పెళ్లైన వెంటనే డబ్బు, గోల్డ్ తో జంప్ అయ్యింది.
తాజాగా కర్నాటక యువకుడిని పెళ్లి చేసుకున్న వాణి అదను చూసుకుని పరారైంది. తాను మోసపోయానని తెలుసుకుని బాధితుడు లబోదిబోమంటున్నాడు. దీనిపై ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ముత్తిరెడ్డి మహా కంత్రీ అని తేలింది. ఆమె ఇప్పటికే పలువురిని మోసగించినట్లు బయటపడింది.