Hyd Police Identify Dead Body Recovered From Water Tank
Hyd Police identify dead body recovered from water tank : ముషీరాబాద్ లోని హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్‌లో లభ్యమైన మృతుడు ఎవరు? అనేది పోలీసులు గుర్తించారు. వాటర్ ట్యాంక్ లో మృతదేహం ఉండటం అదికాస్తా కుళ్లిపోవటం అది తెలియక జనాలు అదే నీళ్లు తాగటం వంటి పలు ఘటనలు తీవ్ర ఆందోళన కలిగాయి. ఈక్రమంలో వాటర్ ట్యాంక్ లో మృతుడు ఎవరు? ఎవరైనా చంపి ట్యాంక్ లో పడేశారా? అని ఉత్కంఠ నెలకొన్న క్రమంలో పోలీసులు మృతుడు ఎవరు అనేది గుర్తించారు. 15 రోజుల క్రితం కనిపించకుండా పోయిన కిశోర్ అనే యువకుడిగా గుర్తించారు.
రీసాల గడ్డ వాటర్ ట్యాంకులో లభించిన మృతదేహాన్ని.. చిక్కడపల్లిలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన కిషోర్‌దిగా గుర్తించారు. ఘటన స్థలంలో లభ్యమైన చెప్పుల ఆధారంగా మృతదేహం కిషోర్‌దేనని పోలీసులు తేల్చారు. కిషోర్ కొద్ది రోజుల క్రితం ఇంట్లో గొడవ పెట్టుకని వెళ్లిపోయాడు. కిశోర్ కనిపించకుండాపోవటంతో ఎక్కడెక్కడో వెతికిన కుటుంబ సభ్యులు వారి బంధువుల్ని కిశోర్ గురించి స్నేహితుల్ని ఆచూకీ తీసారు. కానీ ఫలితం లేదు. దీంతో కిశోర్ కనిపించట్లేదని కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిశోర్ కోసం గాలిస్తుండగా అదే సయమంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
Read more : Dead Body In Water Tank : మిస్టరీగా మారిన వాటర్ ట్యాంక్ మృతదేహం-ఆందోళనలో బస్తీ వాసులు
ట్యాంకు శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది మృతదేహాన్ని గుర్తించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం గురించి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జలమండలి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ట్యాంకు నుంచి బయటకు తీయించగా..అప్పటికే మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. ఈ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మృతుడు 35 ఏళ్ల కిశోర్ అని గుర్తించామని..అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరన్నా చంపి ట్యాంకులో పడేశారా? అని దర్యాప్తు చేస్తున్నామని ట్లు సీఐ జహంగీర్‌యాదవ్ తెలిపారు. 10 నుంచి 15 రోజులుగా మృతదేహం ట్యాంకులో ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పిన సీఐ చుట్టూ పది అడుగుల ప్రహరీ, గేటు తాళం ఉంటుంది. అయినా అతడు లోపలకు రావడం, వంద అడుగుల ట్యాంకుపైకి ఎలా ఎక్కా డు? అనేది అంతుబట్టకుండా ఉంది. ఒక్కడే వచ్చాడా? ఇతరులతో కలిసి వచ్చాడా? ఎవర్నా వస్తే వారు ఎవరు? వాళ్లే చంపేసి ట్యాంకులో పడేశారా? అనేది విచారణలో తెలుస్తుందని తెలిపారు.
Read more : RRR Trailer: మా థియేటర్‌కి బందోబస్త్ కావాలి.. పోలీసులకు రిక్వెస్ట్ లెటర్!
ట్యాంక్ పై ఉన్న చెప్పులు కిశోర్ వేనని పోలీసులు భావించిన పోలీసులు వాటి ఆధారంగానే విచారణ ప్రారంభించారు. దీంట్లో భాగంగా మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో నమోదు అయిన మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టి..కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసులపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే మృతుడిని చిక్కడిపల్లికి చెందిన కిషోర్‌గా గుర్తించారు. మృతుడు తరుచూ వాటర్ ట్యాంక్ వద్దకు వస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది.
రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంక్‌లో మృతదేహం ఉందనే విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆ నీరే తాము తాగుతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని రోజులుగా కుళాయిల్లో వస్తున్న నీరు బాగాలేదనీ..ఏదో వాసన వస్తోందని..కానీ మృతదేహం ఉన్న నీటిని తాము తాగుతున్నామని తెలియలేదని..ఈ విషయం ఇప్పుడు తెలిసి ఆందోళనగా ఉందని తెలిపారు.