Jani Master Remand Report : లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
”2019లో జానీ మాస్టర్ కు, బాధితురాలకు పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని ఓ హోటల్ లో బాధితురాలిపై జానీ లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తనకున్న పలుకుబడితో ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడు. జానీ భార్య కూడా బాధితురాలని బెదిరించింది” అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జానీకి అక్టోబర్ 3వ తేదీ వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీని చంచల్ గూడ జైలుకి తరలిచారు. మరోవైపు జానీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే జానీపై సెక్షన్ 376తో పాటు 323, 506తో పాటు పోక్సో యాక్ట్ (మైనర్ పై లైంగిక దాడి) కూడా పోలీసులు నమోదు చేశారు. జానీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
Also Read : జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయిపై భార్య అయేషా సంచలన కామెంట్స్