జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయిపై భార్య అయేషా సంచలన కామెంట్స్

మాస్టర్‌ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించిందని చెప్పారు. తాను ఆ అమ్మాయికి కౌన్సెలింగ్..

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయిపై భార్య అయేషా సంచలన కామెంట్స్

Telugu film choreographer Jani Master wife

Updated On : September 19, 2024 / 6:33 PM IST

జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైన నేపథ్యంలో దీనిపై ఆయన భార్య అయేషా స్పందించారు. 16 ఏళ్ల వయసులో ఆమెను అత్యాచారం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. డ్యాన్సర్లు, సినీపరిశ్రమతో పాటు రాజకీయంగా అందరూ కలిసి జానీని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.

బాధితురాలికి అవకాశాలు ఇస్తున్న వారి మీదనే రేపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుందని అయేషా తెలిపారు. తన భర్త మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తన భర్త కెరీర్‌ను నాశనం చేసేందుకు పక్కగా ప్లాన్ చేశారని అన్నారు. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకూడదని ఇరికించారని చెప్పారు.

నేషనల్ అవార్డు వచ్చిన తరువాత జానీ మాస్టర్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని అయేషా ఆరోపించారు. బాధితురాలని చెప్పుకుంటున్న ఆ అమ్మాయి టాలెంట్‌ను చూసి డీ షో తరువాత ఆమెకు జానీ మాస్టర్ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఆ అమ్మాయిని వాళ్ల అమ్మ చాలా టార్చర్ చేస్తుందని, ఆమె వాళ్ల కుటుంబ విషయాలు మొత్తం తమతో షేర్ చేసుకుందని అన్నారు.

ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని అయేషా చెప్పారు. ఫిర్యాదు ఇచ్చిన ఆమె బయటికి వచ్చి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల వయసులో అత్యాచారం జరిగితే అప్పుడు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మూడేళ్ల నుంచి ఆమె ప్రవర్తన తేడాగా ఉందని అన్నారు. మాస్టర్‌ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించిందని చెప్పారు. తాను ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చానని తెలిపారు. మాస్టర్‌తో డబుల్ గేమ్స్ ఆడవద్దని హెచ్చరించానని చెప్పారు.

జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డూ.. ఆధారాలు ఇవిగో..: ఆనం వెంకట రమణారెడ్డి