జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డూ.. ఆధారాలు ఇవిగో..: ఆనం వెంకట రమణారెడ్డి

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిందని..

జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డూ.. ఆధారాలు ఇవిగో..: ఆనం వెంకట రమణారెడ్డి

Updated On : September 19, 2024 / 8:17 PM IST

వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతున్న విషయం తెలిసిందే. లడ్డూల తయారీ అంశంపై టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మరో విషయం బయటపెట్టారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిందని చెప్పారు. జులై 8న ల్యాబ్‌కు పంపించగా అదేనెల 17న ఎన్‌డీడీబీ కాల్ప్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని అన్నారు.

ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్ తో పాటు మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్‌టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా వైసీపీ తీరు బయటపడిందని తెలిపారు. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని కొన్ని ఆధారాలు చూపించారు.

‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులని కోరుకుంటున్నా… తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కుళ్లిపోయిన జంతు మాంసం వాడారు.. ప్రతి హిందువు, ఈ రోజు సాయంత్రం స్నానం చేసి, ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టి, స్వామి వారిని క్షమాపణ కోరండి. జగన్ రెడ్డి చేసిన పాపం మనకు, మ‌న‌ రాష్ట్రానికి తగలకుండా, దేవుడిని వేడుకోండి’ అని ఆనం చెప్పారు.

ల్యాబ్ రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు: వైవీ సుబ్బారెడ్డి