Extra Marital Affair : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన పోలీసు అధికారి

పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన పోలీసు అధికారి ఉదంతం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

Extra Marital Affair : పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన పోలీసు అధికారి ఉదంతం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రామభద్రపురం మండలం మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అనే యువతి..అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీసు లైన్స్‌లో రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో 2020 లో ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు రావటంతో గ్రామ పెద్దల వద్దకు పంచాయతీ చేరింది. దీంతో గోపాలకృష్ణ ద్వారా కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు పెద్దలు.  ఆతర్వాత కొన్నిరోజులకు మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు.

గోపాలకృష్ణ డిప్యుటేషన్ మీద విశాఖపట్నంలో విధులు నిర్వహించటానికి వచ్చాడు.  విశాఖపట్నం నుంచి అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో సన్నిహితంగా గడుపుతూ ఉండేవాడు. ఈనేపధ్యంలో ఉషారాణి గర్భవతి అయ్యింది. దీంతో పెళ్ళి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకు వచ్చింది.

అయితే ఆమెను పెళ్లి చేసుకోటానికి గోపాలకృష్ణ నిరాకరించాడు. తనకున్యాయం చేయాలని ఉషారాణి విజయనగరంలోని హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్ధానిక పోలీసు స్టేషన్ లో గోపాలకృష్ణపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Social Media Effect : టీడీపీ నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు

ట్రెండింగ్ వార్తలు