Social Media Effect : టీడీపీ నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టటం లేదు. ప్రతిపక్ష నాయకుడు మొదలు ఎవరైనా సరే వారి మీద పోలీసు కేసులు పెడుతున్నారు.

Gouthu Sirisha
Social Media Effect : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టటం లేదు. ప్రతిపక్ష నాయకుడు మొదలు ఎవరైనా సరే వారి మీద పోలీసు కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి పాల్పడితే చర్యలు తీసుకున్న వైసిపి సర్కార్ ఇప్పుడు వీరికి సహకరించిన వారిపైనా ఉక్కుపాదం మోపుతోంది.
తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమ్మఒడి ,వాహనమిత్ర పధకాలు రద్దు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుపై గౌతు శిరీష కు నోటీసులు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట లోని శివాజీ నివాసానికి నిన్న రాత్రి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 6 సోమవారం నాడు మంగళగిరి లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసు లో పేర్కొన్నారు. సీఆర్పీసిలోని సెక్షన్ 41 క్రింద నోటీసు జారిచేసినట్టు తెలుస్తోంది.
Also Read : Uddhav Thackeray: కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా ఉంటుంది: సీఎం ఉద్ధవ్ ఠాక్రే