మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

  • Publish Date - December 2, 2019 / 02:18 AM IST

నల్గొండ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో వీరంతా సజీవంగా  ఉన్నారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్కూట్‌తో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపేశాడు.  పెను ప్రమాదం తప్పి అందరూ ప్రాణాలతో బయటపడటంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు.