Madannapet Girl Case: అల్లరి చేస్తోందని.. మేనమామ, అత్తలే చంపేశారు.. మాదన్నపేట బాలిక హత్య కేసులో సంచలన విషయాలు..

ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేశారు మేనమామ, అత్త.

Madannapet Girl Case: అల్లరి చేస్తోందని.. మేనమామ, అత్తలే చంపేశారు.. మాదన్నపేట బాలిక హత్య కేసులో సంచలన విషయాలు..

Updated On : October 4, 2025 / 12:52 AM IST

Madannapet Girl Case: హైదరాబాద్ మాదన్నపేటలో బాలిక హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకులు ఎవరో తెలిసి అంతా షాక్ అయ్యారు. బాలికను మేనమామ, అత్తలే చంపేశారు. ఏడేళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేశారు మేనమామ, అత్త. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. ఆస్తి పంపకాల విషయంలో బాలిక తల్లితో కొన్నాళ్లుగా వారికి తగాదాలు ఉన్నాయి. ఈ గొడవల కారణంగా బాలిక హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గురువారం ఏడు సంవత్సరాల బాలిక మిస్సింగ్ అయ్యింది. శుక్రవారం ఉదయం ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లో బాలిక మృతదేహం లభ్యమైంది. మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ అయిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే బాలిక మృతదేహం ఇంట్లోని వాటర్ ట్యాంక్ లో లభ్యం కావడం సంచలనంగా మారింది. వాటర్ ట్యాంక్ నుంచి బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంచన్ బాగ్ లో నివాసం ఉండే మహమ్మద్ అజీమ్, షబానా బేగం దంపతుల కుమార్తె సుమయ్య. రెండు రోజుల క్రితం కూతురు సుమయ్య(7) తల్లితో కలిసి మాదన్నపేట చౌవనికి వచ్చింది.

Also Read: వీధుల్లో తిప్పుతూ.. బాలిక గ్యాంగ్ రేప్ నిందితులకు.. చిత్తూరు పోలీసుల మార్క్ ట్రీట్ మెంట్