Student Takes Life: తిరుపతిలో తీవ్ర విషాదం.. మద్యం తాగి స్కూల్ కి వచ్చిన విద్యార్థి.. ఆ భయంతో రైలు కింద పడి..
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.

Student Takes Life: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి మద్యం తాగి స్కూల్ కి వెళ్లాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు టీచర్స్ కు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థి మద్యం తాగి స్కూల్ కి వచ్చాడని చెప్పారు. వాళ్లు వెంటనే ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థిని గదిలోకి పిలిపించిన ప్రిన్సిపల్.. అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తన తల్లిదండ్రులకు విషయం తెలిస్తే కొడతారని భయపడ్డాడో మరో కారణమో కానీ.. బాగా భయపడి పోయిన విద్యార్థి స్కూల్ గోడ దూకి పారిపోయాడు. అదే భయంతో ముంగిలిపట్టులో రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.