Pudding And Mink Pub Case
Pudding And Mink Pub : హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు దాడి చేయటానికి రెండు వారాల క్రితమే ఫుడింగ్ మింక్ పబ్‌కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు. పబ్ లోకి డ్రగ్స్ సరఫరా అయ్యాయనే పక్కా సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది.
డ్రగ్స్‌తో పాటు హాష్ ఆయిల్, సిగరెట్లు, గంజాయి అమ్మకాలను పబ్ యాజమాన్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో హాష్ ఆయిల్ సిగరెట్ రూ.8 వేల చొప్పున అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో లేట్‌నైట్ పార్టీ జరుగుతున్నట్లు మరో పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్‌పై దాడి చేసినప్పుడు పోలీసులు 148 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ 148 మంది రక్తనమూనాల సేకరణ ఇప్పుడు కష్టతరంగా మారింది. కాగా ఈకేసులో ఏ4నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న కిరణ్ రాజుకు పోలీసులు నోటీసులను మెయిల్ ద్వారా పంపించారు. కాగా….తాను విదేశాల్లో ఉన్నానని, డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు కిరణ్‌రాజు మెయిల్ లో సమాధానం ఇచ్చాడు.
Also Read : TS Covid Update : తెలంగాణలో కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదు