Raja Singh: రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. స్పందించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41(ఏ) కింద ఆయనకు షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అయితే, పోలీసుల తీరుపై రాజాసింగ్ మండిపడ్డారు. పాత కేసుల్లో తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ఈ నోటీసులను నిన్ననే సిద్ధం చేశారని, ఇవాళ తనకు అందించారని అన్నారు. కేసులు నమోదైన ఆరు నెలల నుంచి పోలీసులు ఏం చేశారని ఆయన నిలదీశారు.

Raja Singh On PD Act

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41(ఏ) కింద ఆయనకు షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అయితే, పోలీసుల తీరుపై రాజాసింగ్ మండిపడ్డారు. పాత కేసుల్లో తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ఈ నోటీసులను నిన్ననే సిద్ధం చేశారని, ఇవాళ తనకు అందించారని అన్నారు. కేసులు నమోదైన ఆరు నెలల నుంచి పోలీసులు ఏం చేశారని ఆయన నిలదీశారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఆందోళనలు జరుగుతున్నాయని పలువురు నేతలు మండిపడుతున్నారు. రాజాసింగ్ ను జైలుకు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజాసింగ్ ను వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు చేసిన వెంటనే బెయిల్ పై విడుదల చేయడం ఏంటని మండిపడుతున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆందోళనలు చెలరేగుతుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో రాజాసింగ్ కు నోటీసులు అందడం గమనార్హం.

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు