ప్రేమ పేరుతో 9 వతరగతి చదివే బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో కోవై పోలీసులు 7 గురుని అరెస్టు చేశారు. కోవై కి చెందిన భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న స్కూల్లో 9వతరగతి చదువుతోంది. బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లితండ్రులు ఆదివారం ఏప్రిల్ 12న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
అక్కడ డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించగా నివ్వెరపోయే విషయం బయటపడింది. పరీక్షల అనంతరం బాలిక గర్భవతి అని డాక్టర్లు తేల్చారు. మైనరు బాలిక గర్భం ధరించటంపై ఆస్పత్రి డాక్టర్లు కోవై ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ ఉండటం…ప్రజలంతా కరోనా భయంతో ఉండటంతో….బాలిక కూడా ఆస్పత్రిలో ఉండలేక ఎవరికీ చెప్పకుండా తప్పించుకు పారిపోయింది. అలర్టైన పోలీసులు బాలికను గాలించి పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తరలించారు.
బాలికను విచారించగా తనను ప్రేమిస్తున్నానని చెప్పి…చనువుగా మెలిగిన వారే తనను బెదిరించి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది, వారి వల్లే తాను గర్భం ధరించినట్లు చెప్పింది. తల్లి తండ్రులకు భయపడి ఈవిషయం చెప్పలేదని….ఇటీవల ఎక్కువ సార్లు కడుపు నొప్పిరావటంతో పరీక్ష చేయించుకోగా ఈవిషయం బయటపడిందని తెలిపింది.
బాలిక వద్ద వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమెపై లైంగిక దాడి చేసిన సింగనల్లూరు కు చెందిన సంతోష్(19), ప్లస్ వన్, ప్లస్ టూ చదువుతున్న నలుగురు విద్యార్ధులు, కార్తీక్(23)ధనశేఖర్(24), అనేవారితో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసారు. మైనార్టీ తీరని నలుగురు విద్యార్ధులను జువైనల్ హోం కు తరలించారు. మిగతా ముగ్గురిని జైలుకు పంపారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా…..మైనార్టీ తీరని బాలికను ఒక విద్యార్ధి ఇంటికి పిలిపించుకుని ఆమెపై లైంగిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఈసంగతి తెలిసిన తర్వాత కార్తీక్, ధనశేఖర్ బాలికను బెదిరించి ఇళ్ళకు పిలిపించుకుని లైంగిక దాడి చేశారని తెలిసింది. మైనర్ బాలికపై దాడిచేసిన కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.