Sreekanth Vettiyar Rape Case : పెళ్లి పేరుతో అత్యాచారం చేసిన యూట్యూబర్ పై కేసు నమోదు

కేరళలోని ప్రముఖ యూట్యూబ్ సెలబ్రిటీ శ్రీకాంత్ వెట్టియార్‌పై  అత్యాచార కేసు నమోదయ్యింది.  పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళపై   లైంగిక దాడి చేశాడనే ఆరోపణతో ఆయనపై అత్యాచారం కేసు నమోద

Sreekanth Vettiyar Rape Case : కేరళలోని ప్రముఖ యూట్యూబ్ సెలబ్రిటీ శ్రీకాంత్ వెట్టియార్‌పై  అత్యాచార కేసు నమోదయ్యింది.  పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళపై   లైంగిక దాడి చేశాడనే ఆరోపణతో ఆయనపై అత్యాచారం కేసు నమోదయ్యింది.

శ్రీకాంత్ వెట్టియార్  హిట్ సినిమాల స్పూఫ్ వీడియోలు చేయటం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. మహిళా సాధికారత, రాజకీయ నిబధ్దత వంటి అంశాలపై   శ్రీకాంత్ చేసే వీడియోలకు ఆకర్షితురాలినై  ఒక మహిళ శ్రీకాంత్ అభిమాని అయినట్లు తెలిపింది.

బాధితురాలైన 8 ఏళ్ల బాలుడి తల్లి….కొచ్చిలో నివసిస్తున్నప్పుడు శ్రీకాంత్‌తో   పరిచయం పెంచుకుని అతనితో సన్నిహితంగా ఉండసాగింది.  2021 ఫిబ్రవరిలో జరిగిన శ్రీకాంత్ పుట్టిన రోజుకు తనను ఆహ్వానించాడని,  ఎర్నాకులంలోని  అలువాలోని ఒక ఫ్లాట్ లోనూ, ఆ తర్వాత కొచ్చిలోని హోటల్ గదిలోనూ తనపై శ్రీకాంత్ లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది.
Also Read : AP PRC: ఉద్యోగుల అభ్యంతరాలపై ప్రభుత్వం సమాలోచనలు
ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని శ్రీకాంత్ వెట్టియార్ తన స్నేహితులతో పదే పదే ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కోంది.  మహిళ ఇప్పడు తాజాగా ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీకాంత్ పై కొచ్చి పోలీసులు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ గురించి గాలింపు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు