Waranagal: వీడిన రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య కిడ్నాప్ & మర్డర్ మిస్టరీ

ఈ హత్యకు సర్వే నెంబర్ 174 గల భూ వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. హత్యకు 8.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నిందితుడు అంజయ్య కిడ్నాప్ చేయించాడు. ఇక తాజాగా పట్టుకున్న ముగ్గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్

Waranagal: వీడిన రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య కిడ్నాప్ & మర్డర్ మిస్టరీ

Updated On : June 18, 2023 / 8:45 PM IST

Warangal: ఎంపీడీఓ రామకృష్ణయ్య కిడ్నాప్, మర్డర్ మిస్టరీకి వరంగల్ పోలీసులు ముగింపు పలికారు. సుపారీ తీసుకున్న నలుగురు వ్యక్తులు ఈ హత్య చేసినట్లు వరంగల్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ తెలిపారు. సుపారీ ఇచ్చిన అంజయ్యతో పాటు శ్రీకాంత్, బాషా, భాస్కర్ అనే మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఆదివారం వెల్లడించారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న తిరుపతి, రాజు అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని తొందరలోనే పట్టుకుంటామని సీపీ రంగనాథ్ అన్నారు.

Kalyaan Dhev : శ్రీజ‌తో విడాకులు.. వారంలో నాలుగు గంట‌లు.. ఇన్‌స్టా పోస్ట్‌తో క‌ల్యాణ్‌దేవ్ క్లారిటీ..!

కాగా, ఈ హత్యకు సర్వే నెంబర్ 174 గల భూ వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. హత్యకు 8.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నిందితుడు అంజయ్య కిడ్నాప్ చేయించాడు. ఇక తాజాగా పట్టుకున్న ముగ్గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. కిడ్నాప్ చేసిన రోజే రామకృష్ణయ్యను హత్యచేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కారు డిక్కిలో డెడ్ బాడీని పెట్టి చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ గుంటలో పడేసినట్లు పేర్కొన్నారు.

Rakesh Master : నేను అస్తమించే సూర్యుడిని.. రాకేశ్‌ మాస్టర్‌ తన మరణం గురించి ముందే చెప్పారు.. వీడియో వైరల్!

ప్రధాన నిందితుడు అంజయ్య తన బావమర్ది భార్య సుభద్ర హత్యకేసులో నిందితులుగా ఉన్నరు. నిందితుల వద్ద మూడు సెల్ ఫోన్లు, 15వేల రూపాయల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు వరంగ్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు.