Road Accident (2)
Mahabubnagar Road Mishap : తెలంగాణలో రహదారి రక్తసిక్తమైంది. ఘోర ప్రమాదం పలువురి ప్రాణం తీసింది. మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ 44వ జాతీయ రహదారిపై ఆటో, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మేడిగడ్డ, నందారం, బాలానగర్ తండాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఈ ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆరుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన డీసీఎంకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.