×
Ad

Kondagattu Anjaneyaswamy Temple Robbery : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనం.. గర్భగుడిలోని విలువైన వస్తువులు, విగ్రహాలు చోరీ

దొంగలు బరితెగించారు. ఏకంగా దేవాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అర్ధరాత్రి దేవాలయంలో దొంగతనం చేశారు.

  • Published On : February 24, 2023 / 08:52 AM IST

KONDAGATTU

Kondagattu Anjaneyaswamy Temple Robbery : దొంగలు బరితెగించారు. ఏకంగా దేవాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అర్ధరాత్రి దేవాలయంలో దొంగతనం చేశారు. గర్భగుడిలోని విలువైన వస్తువులు, విగ్రహాలు చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ తలుపులు మూసివేసి సీసీఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే గతంలో కూడా పలు ఆలయాల్లో దొంగతనాలు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.