Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.

Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి9వ తేదీన మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. మనీశ్ సిసోడియా కస్టడీ ముగియడంతో శుక్రవారం(మార్చి17,2023)న రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన్ను ఈడీ హాజరుపర్చింది. విచారణ సమయంలో కీలక విషయాలు రాబట్టామని, ఇంకా కొందరితో కలిపి విచారించాల్సి ఉన్నందున మళ్లీ కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టును ఈడీ అభ్యర్థించింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియా కస్టడీని ఐదు రోజులు పొడిగించింది.

దర్యాప్తు కీలక దశలో ఉందని, అనేక ఆధారాలు, కొత్త విషయాలను సేకరించామని ఈడీ తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ కి తెలిపారు. ఇప్పటికే కొంతమంది నిందితులతో కలిపి మనీశ్ సిసోడియాను విచారించామని తెలిపారు. అలాగే మరికొంతమంది కలిసి మనీశ్ సిసోడియాను విచారించాల్సివుందని తెలిపారు. ప్రధానంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులతో కలిపి సిసోడియాను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మనీశ్ సిసోడియాకు సంబంధించిన మొబైల్ ఫోన్ 2021 నుంచి 2022 వరకు ఎనిమిది నెలలపాటు కనిపించకుండా పోయిన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Nitesh Rana Resigns: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేశ్ రాణా రాజీనామా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక మలుపు ..!

మనీశ్ సిసోడియా ఫోన్ పాడైదని చెబుతున్నారు.. ఇంకా అనేక ఆధారాలను పరిశీలించాల్సివుందని దీని వల్ల సిసోడియా కస్టడీ పొడించాలని కోరుతున్నామని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.
వారం రోజుల కస్టడీ పొడిగించాలని కోరారు. కానీ ఐదు రోజులు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి22వ తేదీ వరకు కూడా సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉంటారు. ప్రధానంగా శుక్రవారం సౌత్ గ్రూప్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఢిల్లీ ఓబెరాయ్ హోటల్ లో జరిగిన సమావేశాలకు ఇక్కడి నుంచే సౌత్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహించిందని కోర్టుకు తెలియజేశారు.

అయితే సిసోడియా తరపు న్యాయవాదులు కూడా కీలక వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎటువంటి సిసోడియాకు వ్యతిరేకంగా లేవని చెప్పారు. మనీలాండరింగ్ కేసు అని చెబుతున్నారు కానీ ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు.అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతూ వేధిస్తున్నారని చెప్పారు. కస్టడీకి అవసరం లేదని సిసోడియా తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. సిసోడియాను ఈడీ రోజుకు ఎన్ని గంటలు ప్రశ్నిస్తుందన్న విషయానికి సంబంధించి కోర్టులో న్యాయమూర్తితో మాట్లాడారు.

Manish Sisodia Remand Report : మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. మరోసారి కవిత పేరు ప్రస్తావన, హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ డీల్

నిన్న (గురువారం) ఒక్క రోజు ఆరు గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారని, అడిగిన విషయాలే మళ్లీ మళ్లీ అడుతుతున్నారు కానీ కొత్త విషయాలేవి అడగడం లేదని కోర్టుకు తెలిపారు. సిసోడియా వ్యాఖ్యల పట్ల ఈడీ తరపు న్యాయవాదులు స్పందించారు. ఓవైపు తనను వేధిస్తున్నారంటూ ఈడీ కస్టడీలో చెబుతూ.. మరోవైపు తనను ఏ ప్రశ్నలు అడగడం లేదని సిసోడియా చెబుతున్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు