Manish Sisodia Remand Report : మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. మరోసారి కవిత పేరు ప్రస్తావన, హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ డీల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవుతున్నట్లు ఈడీ పేర్కొంది.

Manish Sisodia Remand Report : మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. మరోసారి కవిత పేరు ప్రస్తావన, హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ డీల్

manish

Manish Sisodia Remand Report : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవుతున్నట్లు ఈడీ పేర్కొంది. ఇక మనీశ్ సిసోడియా రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. సౌత్ లాబీపైన ఈడీ పలు విషయాలను ప్రస్తావించింది.

సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రూ, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు పేర్కొంది. మనీశ్ సిసోడియా తరపున విజయ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ ఇండో స్పిరిట్ కు కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చిన స్టేట్ మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్లు ఈడీ పేర్కొంది.

MLC Kavitha ED Probe : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. కార్యాలయం ముందు భారీ బందోబస్తు

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూప కల్పనలో ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది. 2021 మార్చి 19, 20 తేదీల్లో కవితను విజయ నాయర్ కలిశారని, న్యూఢిల్లీలోని గౌరి అపార్ట్ మెంట్ లో జరిగిన సమావేశం తర్వాత అరుణ్ అభిషేక్ 2021 జూన్ లో హైదరాబాద్ లో ఐటీసీ కోహినూరులో విజయ్ నాయర్ దినేశ్ అరోరాతో సమావేశం అయ్యారని మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

టోకు వ్యాపారి లాభాల మార్జిన్ 5 శాతం నుంచి 12 శాతానికి పెంచినట్లు సిసోడియా చెప్పారు. అయితే టోకు వ్యాపారులకు 12 శాతం లాభాన్ని కొనసాగించడానికి సిసోడియా ఎలాంటి సూచనలు చేయలేదని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రకటించారు. ఇది సిసోడియా తప్పుడు ప్రకటనగా ఈడీ పేర్కొంది.
మొబైల్ ఫోన్లలోని డిజిటల్ డేటాను నాశనం చేసేందుకు కొత్త పద్ధతులను రూపొందించినట్లు ఈడీ తెలిపింది.

Manish Sisodia-Delhi Liquor scam: 7 రోజుల ఈడీ కస్టడీకి మనీశ్ సిసోడియా

మనీశ్ సిసోడియా తన పీఎస్ హెచ్ దేవేంద్ర శర్మ పేరుతో సిమ్ ఉపయోగించారని వివిధ పేర్లతో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను కూడా ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. మానీలాండరింగ్ నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సిసోడియా చేతనైనా ప్రయత్నం చేశారని అనుమానం కలుగుతుందని ఈడీ పేర్కొంది.