MLC Kavitha ED Probe : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. కార్యాలయం ముందు భారీ బందోబస్తు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

MLC Kavitha ED Probe : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. కార్యాలయం ముందు భారీ బందోబస్తు

KAVITHA (2)

MLC Kavitha ED Probe : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే ఈడీ కార్యాలయంలోనే మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై ఉన్నారు. రూ.100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్రపై ఈడీ ప్రశ్నించనుంది. మనీశ్ సిసోడియా కస్టడీ పిటిషన్ లో కవిత పేరును ప్రస్తావించిన ఈడీ మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50, 54 కింద ప్రశ్నించనుంది.

మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, కవితను కలిపి ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ నేపథ్యంలో నిన్న(శుక్రవారం) బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో కవిత భేటీ అయ్యారు. ఈడీ ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ఆమె లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇవాళ (శనివారం) ఈడీ ఆఫీస్ కు వెళ్లే ముందు కవిత మరోసారి లిగల్ టీమ్ తో భేటీ కానున్నారు. మరోవైపు కవితకు అండగా ఉండేందుకు మంత్రలు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లారు.

Delhi Liquor Scam: వాంగ్మూలం ఉపసంహరించుకున్న పిళ్లై.. కవిత విచారణకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

అక్కడ సీఎం కేసీఆర్ అధికార నివాసంలో కవితను కలిసి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడారు. ఒకవైపు ఈడీ విచారణకు కవిత సిద్ధమవుతుంటే మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత విచారణకు ముందు ఈడీకి ఇచ్చిన తన స్టేట్ మెంట్ ను ఉపసంహరించుకుంటూ అరుణ్ పిళ్లై ప్లేట్ పిరాయించారు. సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన పిళ్లై.. కవిత తరపున వ్యాపారం చేశారని, ఆయన కవితకు సహాయకుడిగా పని చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

అరుణ్ పిళ్లైని 29 సార్లు ప్రశ్నించిన ఈడీ 11 సార్లు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కవిత విచారణకు ప్రధానంగా అరుణ్ పిళ్లై వాంగ్మూలమే ఆధారంగా భావించి ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఈడీకి అరుణ్ పిళ్లై ట్విస్టు ఇచ్చారు. తాను ఈడీకి ఇచ్చిన అన్ని వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అరుణ్ పిళ్లై పిటిషన్ దాఖలు చేశారు.