Delhi Liquor Scam: వాంగ్మూలం ఉపసంహరించుకున్న పిళ్లై.. కవిత విచారణకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

తాను కవిత బినామీ అని పిళ్లై గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టుకు తెలిపాడు. ఈ అంశంలో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Delhi Liquor Scam: వాంగ్మూలం ఉపసంహరించుకున్న పిళ్లై.. కవిత విచారణకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితను విచారించబోయే ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అనూహ్య మలుపు తీసుకుంది. కవిత విషయంలో తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అరుణ్ రామచంద్ర పిళ్లై తెలిపాడు. దీనిపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్‌ చర్చిలో కాల్పులు.. పలువురి మృతి

తాను కవిత బినామీ అని పిళ్లై గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టుకు తెలిపాడు. ఈ అంశంలో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తాను కవిత బినామీ అని, కవిత ప్రయోజనాల కోసమే పని చేశాను అని పిళ్లై ఈడీకి చెప్పాడు. ఈ వాంగ్మూలం ఆధారంగానే ఈడీ కవితను విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్‌కు సంబంధించి 29సార్లు పిళ్లైని ఈడీ విచారించింది. 11సార్లు అతడి వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసింది. గత ఐదు రోజులుగా పిళ్లై ఈడీ కస్టడీలోనే ఉన్నాడు.

Visakha ODI: విశాఖలో 19న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

మనీ లాండరింగ్, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో సౌత్ గ్రూప్ పాత్ర, ఇతర కీలక అంశాలపై ఈడీ అధికారులు పిళ్లైని ప్రశ్నిస్తున్నారు. కెమెరా ముందే అతడిని ప్రశ్నిస్తూ, వీడియో రికార్డు చేస్తున్నారు. అయితే, ఉన్నట్లుండి పిళ్లై తన వాంగ్మూలాల్ని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో శనివారం ఈడీ అధికారులు కవితను విచారించాలనుకున్నారు. పిళ్లైతో కలిసి కవితను విచారించాల్సి ఉంది. తాజా పరిణామాలపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.