Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్‌ చర్చిలో కాల్పులు.. పలువురి మృతి

హ్యాంబర్గ్‌లో ఉన్న జెహోవా విట్‌నెస్ సెంటర్ హాల్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ సెంటర్ ఇంటర్నేషనల్ చర్చిలో భాగం. ఇక్కడ భారీగా జనం గుమిగూడి ఉన్న సమయంలో గన్ చేతబట్టిన వ్యక్తి ఉన్నట్లుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురుపైనే మరణించి ఉంటారని అంచనా.

Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్‌ చర్చిలో కాల్పులు.. పలువురి మృతి

Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్ పట్టణంలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించారు. ఈ ఘటన గురువారం రాత్రి 09.15 గంటల ప్రాంతంలో జరిగింది. హ్యాంబర్గ్‌లో ఉన్న జెహోవా విట్‌నెస్ సెంటర్ హాల్‌లో ఈ కాల్పులు జరిగాయి.

Viranica Manchu : లండన్‌లో లగ్జరీ ఫ్యాషన్ మాల్ ఓపెన్ చేసిన మంచు విష్ణు వైఫ్..

ఈ సెంటర్ ఇంటర్నేషనల్ చర్చిలో భాగం. ఇక్కడ భారీగా జనం గుమిగూడి ఉన్న సమయంలో గన్ చేతబట్టిన వ్యక్తి ఉన్నట్లుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురుపైనే మరణించి ఉంటారని అంచనా. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమంది మరణించారు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు బిల్డింగ్‌ను చుట్టుముట్టాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డవారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఉన్న మిగతావారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Telangana Cabinet Decisions : రాష్ట్రంలో కొత్త పథకం, ఒక్కొక్కరికి రూ.3లక్షలు, 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు-కేబినెట్ కీలక నిర్ణయాలు

కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎవరు.. ఎందుకు కాల్పులు జరిపారు అనే విషయాల్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో మరణించిన వ్యక్తిని కాల్పులు జరిపిన నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అతడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమకు 12సార్లు కాల్పుల శబ్దం వినిపించిందన్నారు.