RTC Bus Overturn : వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

RTC Bus Overturn : వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. జాతీయ రహదారి 44పై బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులు గాయ పడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నర్సింహ్మా, షకీలా, షబ్బీర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Car Accident : షాకింగ్ వీడియో.. పెళ్లి బృందంపై దూసుకొచ్చి కారు, ఒకరు మృతి, 31మందికి తీవ్ర గాయాలు

క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను ఇతర బస్సుల్లో పంపించారు. అతివేగం, డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు