ప్రాణాలమీదకు తెచ్చిన సెల్ఫీ మోజు

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 06:38 AM IST
ప్రాణాలమీదకు తెచ్చిన సెల్ఫీ మోజు

Updated On : March 24, 2019 / 6:38 AM IST

తిరువనంతపురం : సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తోంది. సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి ప్రమాదాలు బారిన పడుతున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానిగురై మృతి చెందారు. తాజాగా కేరళలో ఓ యువకుడి సెల్ఫీ మోజు అతని ప్రాణాలమీదకు తెచ్చింది.

ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా.. ఏనుగు తొండంతో కొట్టి కాలితో తొక్కింది. ప్రస్తుతం యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన విజువల్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.