ఇదో వెరైటీ : కాకి మాంసంతో చికెన్ వెరైటీలు

డబ్బులకు కక్కుర్తి పడుతున్నారు కొంతమంది వ్యాపారులు. అక్రమమార్గంలో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా చికెన్ మాంసంలో కాకి మాంసం కలిపి విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. భక్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. మటన్, చికెన్ పేరిట ఇతర జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి.
రామేశ్వరం ఆలయంలో భక్తులు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం ఆహారం వేస్తుంటారు. భక్తులు వేసిన ఆహారాన్ని అక్కడున్న కాకులు తింటుంటాయి. తాజాగా ఇలాగే వేసిన ఆహారం తిన్న కాకులు కళ్లు మూశాయి. ఎక్కువ సంఖ్యలో కాకులు చనిపోతుండడంతో అక్కడున్న భక్తుల్లో తీవ్ర కలవరం మొదలైంది. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
భక్తుల కంప్లయింట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వేటగాళ్లు..మద్యం కలిపిన ఆహారం ఇవ్వడం వల్లే..భారీ సంఖ్యలో కాకులు చనిపోయాయని పోలీసులు విచారణలో తేలింది.
ఇలా చనిపోయిన కాకుల మాంసాన్ని చికెన్ స్టాల్స్‌లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. వివిధ వెరైటీల్లో దుకాణదారులు రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన కాకులను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Read More : రియల్ హీరో : జగన్‌కు అక్షయ్ కుమార్ సహాయం