Serial Killer: జైల్లో సీరియల్ కిల్లర్.. భయపడుతున్న తోటి ఖైదీలు

వరుస హత్యలతో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్‌ను చూసి తోటి ఖైదీలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ సీరియల్ కిల్లర్ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒంటరిగా సెల్‌లో ఉంచారు.

Serial Killer: వరుస హత్యలతో మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్‌ను చూసి ఇప్పుడు జైల్లోని ఖైదీలు భయపడుతున్నారు. ఫేమస్ అవ్వడం కోసం శివ ప్రసాద్ దూర్వే అనే యువకుడు వరుస హత్యలకు పాల్పడ్డాడు. నలుగురు సెక్యూరిటీ గార్డులను హత్య చేశాడు.

AP CM YS Jagan: అమరావతిపై ఎలాంటి కోపం లేదు: ఏపీ సీఎం జగన్

అందులోనూ వరుసగా మూడు రోజుల్లో ముగ్గురిని హతమార్చాడు. ఒక సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా శివ ప్రసాద్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు సాగర్ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. అయితే, అతడ్ని చూసి తోటి ఖైదీలు కూడా భయపడుతున్నారట. అకారణంగా, ఫేమస్ అవ్వడం కోసమే హత్యలు చేసిన అతడ్ని చూసి తోటి ఖైదీలు భయాందోళనకు గురవుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో శివ ప్రసాద్ విషయంలో జైలు వార్డెన్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తోటి ఖైదీల భయాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని ఒంటరిగా, ప్రత్యేక సెల్‌లో ఉంచుతున్నారు. అంతే కాదు.. అతడు సెల్ నుంచి బయటకు రాగానే, వార్డెన్లు పక్కనే కాపలాగా ఉంటున్నారు. బాత్‌రూమ్‌కు వెళ్లినా వార్డెన్లు అతడ్ని గమనిస్తున్నారు.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

అలాగే భోజనం చేసిన వెంటనే అతడి చేతి నుంచి పల్లెం లాక్కుంటున్నారు. లేకుంటే ఆ పల్లెంతో ఎవరి మీద దాడి చేస్తాడో అని అటు పోలీసులు, ఇటు ఖైదీలు భయపడుతున్నారు. అతడు చేసిన హత్యల ప్రకారం.. ప్రత్యేకంగా ఆయుధాలేమీ వాడకుండా, అందుబాటులో ఉన్న ఎలాంటి వస్తువుతోనైనా చంపడం అతడి ప్రత్యేకత. అందుకే అతడి సెల్‌లో ఎలాంటి వస్తువులు ఉంచడం లేదు. నిరంతరం జైలు అధికారులు అతడ్ని పర్యవేక్షిస్తున్నారు. అతడు ఎనిమిదో తరగతి చదివి ఉండటం చేత కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకు అతడ్ని చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు