Seven tourists killed, 10 injured in road accident in Kullu
Himachal: హిమాచల్ ప్రదేశ్లోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని కులు ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని కొందరిని బంజర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మరి కొంత మందిని కులు జోనల్ ఆసుపత్రికి తరలించారట. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు చనిపోయారు. అనంతరం చికిత్స పొందుతూ ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన 17 మంది టూరిస్టులను తీసుకొని విహారయాత్ర చేస్తున్న ఒక టెంపో వాహనం.. జలోరి పాస్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. వర్షంతో పాటు పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం గురించి అర్థరాత్రి సమాచారం అందుకున్న అధికారులు.. జిల్లా యంత్రంగాన్ని అప్రమత్తం చేసి అర్థరాత్రే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధిక వర్షాలతో పాటు ప్రమాదాలు కూడా పెరిగాయి. కొండ చరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్లు, ఇతరాలు కొట్టుకుపోవడం, లేదంటే మునిగిపోవడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. కాగా, తాజా ఘటనపై ప్రధానమంత్రం నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.
Congress Crisis: గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం.. అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ…